ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తన కార్యాలయం నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం అందించారు.
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్
నిఘా(ఇంటెలిజెన్స్) విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన డా. అనిల్ కుమార్ సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ను కేసీఆర్ అభినందించారు.
ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ను కేసీఆర్ అభినందించారు. నిఘా(ఇంటెలిజెన్స్) విభాగాధిపతిగా అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్(ట్రాఫిక్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐజీగా అక్కడ విధుల్లో చేరిన ఆయన.. అక్కడే అదనపు డీజీగా పదోన్నతి పొందారు.
ఇవీ చూడండి:సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ