తెలంగాణ

telangana

ETV Bharat / city

SUPREME COURT: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

SUPREME COURT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పీడీ ఖాతాలకు మళ్లించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

SUPREME COURT: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
SUPREME COURT: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

By

Published : Jul 18, 2022, 2:13 PM IST

SUPREME COURT: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత డిపాజిట్‌ (పీడీ) ఖాతాలకు మళ్లించిన స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిధులను వెనక్కి ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా ఆ నిధులు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో నిధులు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని న్యాయవాది తెలపగా.. పరిష్కార కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని కోర్టు సూచించింది. వచ్చిన ఫిర్యాదులను నాలుగు వారాల్లో పరిష్కరించాలని కమిటీని ఆదేశించింది.

కొవిడ్‌ నిధుల మళ్లింపుపై గతంలోనే ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు వెనక్కి ఇవ్వడంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటామని న్యాయవాది అనగా.. అవసరం లేదని ఇటీవల జరిగిన విచారణలో స్పష్టం చేసింది. దీనిపై తామే ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. దాంతో కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details