తెలంగాణ

telangana

ETV Bharat / city

కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు - భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

Inida vice president muppavarapu venkaiah naidu participated in diwali celebrations in hyderabd
కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో ఉపరాష్ట్రపతి

By

Published : Nov 14, 2020, 8:01 PM IST

Updated : Nov 14, 2020, 9:09 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో నగరంలోని ఆయన కుమారుడి నివాసంలో దీపాలు వెలిగించారు. తన సతీమణి ఉషానాయుడుతో కలిసి వెంకయ్యనాయుడు దీపాలు వెలిగించి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లే.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకొనే ఈ దీపావళి స్ఫూర్తితో అందరం ఆత్మస్థైర్యాన్ని పొంది.. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణం దిశగా కంకణబద్ధులమవుదామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టుగా ఈసారి దీపావళి సందర్భంగా జవాన్ల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారి కోసం ఒక దీపాన్ని వెలిగించి వారికి సంఘీభావాన్ని తెలియజేద్దామని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.

కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి:43వ వసంతంలోకి రామగుండం ఎన్టీపీసీ.. మహారత్నగా కీర్తి

Last Updated : Nov 14, 2020, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details