ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై ఇటీవల బెంగళూరు విమానాశ్రంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి తదనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. విజయ్ సేతుపతి, నిందితునికి పోలీస్స్టేషన్లోనే రాజీ కుదిరిందని విజయ్ చెప్తున్నా వివాదం సద్దుమణిగేలా కనిపించట్లేదు.
హిందూ మక్కల్ కట్చి తాజాగా సంచలన ప్రకటన చేసింది. విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తికి ఒక్కో తన్నుకు రూ.1001 నగదు బహుమతి అంటూ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించింది. తమ దైవాన్ని అవమానించిన విజయ్ సేతుపతి క్షమాపణ చెప్పేవరకు ఈ బహుమతి ఉంటుందని తెలిపింది.
ఘటనను విజయే సేతుపతి చిన్నదిగా కొట్టిపడేశారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి అలా ప్రవర్తించారని, ఇది పోలీస్ స్టేషనులోనే సమస్య పరిష్కారమైందని వెల్లడించారు. కానీ, హిందూ మక్కల్ కట్చి మాత్రం ఇపుడు ఈ సమస్యను మరింత పెద్దది చేసేలా ప్రకటన చేయడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. దక్షిణాదిన పలు ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించాడు.
ఇదీ చదవండి :పన్ను నొప్పి అని వెళ్లిన మహిళపై డెంటిస్ట్ అత్యాచారం