తెలంగాణ

telangana

ETV Bharat / city

పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని! - trending news

ఈ హెడ్డింగ్ చూసి.. ఇదేదో టెంప్ట్ చేయడానికి, ఈ ఆర్టికల్ చదివించడానికి పెట్టిన హెడ్డింగ్ అనుకుంటే.. మీ థాట్ 100000 పర్సెంట్ రాంగ్. ఈ వ్యవహారం నిజంగా జరిగింది! "అవునా..? అదెలా సాధ్యమబ్బా? పెళ్లి కాగానే.. మూడు రోజుల్లోనే విషయం తేలిపోద్దిగా! ఏడాది కాలం ఎందుకు పట్టింది? మరి, ఆ గుట్టు ఎలా రట్టైంది?" అనే డౌట్స్ వస్తున్నాయా? ఇప్పుడు ఈ ఆర్టికల్ చదవండి.. స్వయంగా మీరే తెలుసుకుంటారు..

indo
indo

By

Published : Sep 19, 2022, 5:12 PM IST

Updated : Sep 19, 2022, 5:54 PM IST

ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి.. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లోకి వెళ్లాలి. సీన్ ఓపెన్ చేస్తే.. అక్కడి జాంబి నగరంలో ఓ యువతి ఉంది. పేరు NA. ఇదేం పేరు అనకండి.. అదంతే! చూడ్డానికి అందంగా ఉంటుంది. మాంచి చలాకీ పిల్ల. వయసు 22 ఏళ్లు. ఈ వయసులో జనాలు ఎక్కడుంటారో తెలిసిందేగా.. ఉంటే కాలేజ్ లో.. లేదంటే ఆన్ లైన్లో! ఇప్పుడు అసలే సోషల్ ట్రెండ్ హవా కొనసాగుతోంది. ఆన్ లైన్ డేటింగ్ కల్చర్ యమా స్పీడుమీదుంది. సో.. NA కూడా ఓ డేటింగ్ సైట్లో చేరింది.. ఓ బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుంది. అతని పేరు అహ్నాఫ్ అర్రాఫీఫ్. ఇద్దరూ ఆన్ లైన్లో తెగ ప్రేమించేసుకుంటున్నారు. మూడు వాట్సాప్ ముద్దులు.. ఆరు ఫేస్ బుక్ హగ్గులు అన్నట్టుగా సాగిపోతోంది వారి ప్రేమాయణం.

ఇలా సాగుతుండగా.. "ఇంకా.. ఎంత కాలం ఫోన్లోనే ప్రేమించుకుంటాం..? లైవ్ లోకి వచ్చేద్దాం" అని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. "బొమ్మరిల్లు" సినిమాలో సిద్దూ వాళ్లింటికి హాసిని వెళ్లింది కదా. ఇక్కడ మాత్రం హీరోయిన్ ఇంటికి హీరో వచ్చేశాడు. ఒక వారంపాటు NA ఫ్యామిలీతో కలిసి ఉండటానికి వచ్చాడు అహ్నాఫ్. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఎపిసోడ్స్ లో.. హీరోలోని గుడ్ క్వాలిటీస్ ఎలివేట్ చేసే సీన్లు ఎన్నో ఉంటాయి. అవి చూసి.. "హబ్బా.. హీరో పిలగాడు ఎంత మంచివాడో.." అనుకొని ఫ్యామిలీ మొత్తం అతనితో "లవ్"లో పడిపోతుంది. సేమ్ టూ సేమ్.. NA వాళ్ల ఇంట్లోనూ ఇదే జరిగింది. అహ్నాఫ్ ఇంటికి వచ్చిన సమయంలో NA వాళ్ల తండ్రికి ఆరోగ్యం బాగలేదు. దీంతో.. అహ్నాఫ్ దగ్గరుండి సేవలు చేశాడు. ఆ కుటుంబం పట్ల బాధ్యతను ప్రదర్శించాడు. అది చూసి.. "అబ్బాయి చాలా మంచి వాడిలాగా ఉన్నాడండీ.." అన్నది NA వాళ్ల అమ్మ. "అంతేగా.. అంతేగా.." అన్నాడు తండ్రి. వన్ ఫైన్ డే.. పీపీపీ.. డుండుండుం.. అనిపించారు.

అల్లుడు ఇల్లరికం వచ్చేశాడు. ఇక్కడే ఉంటున్నాడు. అయితే.. కొన్ని రోజుల తర్వాత అల్లుడిగారి వాలకంలో ఏదో తేడా కనిపిస్తోంది! NA వాళ్ల అమ్మకు అనుమానం మొదలైంది. చూస్తుండగానే.. డౌట్ మరింత తీవ్రమైంది. "ఇంతకీ ఆమె ఏం చూసి అనుమానిస్తోంది.." అంటారా..? ఏమీ చూపించకుండా.. అల్లుడుగారు అన్నీ కప్పేసుకుంటున్నారు. అందుకే అత్తకు అనుమానం మొదలైంది. రోజంతా డ్యూటీకి వెళ్లొచ్చిన మగాడు.. స్నానం ఫ్రెష్ అప్ అవుతాడు కదా. దానికి ముందు ప్యాంటు, షర్ట్ విప్పేసి.. టవల్ కట్టుకొని బాత్ రూమ్ లోకి వెళ్తాడు కదా.. ఏ ఇంట్లో అయినా ఇది వెరీ నార్మల్ కదా! కానీ.. ఇక్కడ వేరే విధంగా జరుగుతోంది.

అల్లుడు అహ్నాఫ్ డాక్టర్ అని చెప్పుకున్నాడు కదా.. పొద్దంతా డ్యూటీకి వెళ్లి, సాయంత్ర వచ్చిన తర్వాత.. దుస్తులు ఎన్నడూ బెడ్ రూమ్ లో విప్పట్లేదు. కుటుంబ సభ్యుల ముందే కాదు.. చివరకు భార్య ముందు కూడా విప్పట్లేదు. బాత్ రూమ్ లోకి వెళ్లి అక్కడ విప్పుతున్నాడు. అతని బనియన్ ను భార్య ఒక్కసారి కూడా చూడలేదంటే అర్థం చేసుకోండి! అంతేకాదు.. అల్లుడు గారు దుస్తులు విప్పకుండా.. వాటిపైనుంచే స్నానం చేయడాన్ని అత్తగారు ఒకటీ రెండు సార్లు గమనించారు. దీంతో.. ఇదేదో తేడా కేసుగానే కనిపిస్తోందని బలంగా నమ్మడం మొదలు పెట్టింది.

కాల క్రమంలో భార్యకు సైతం కొన్ని డౌట్లు రావడం మొదలయ్యాయి. అహ్నాఫ్ తనకు పేరెంట్స్ ఉన్నాడని అంటాడు కానీ.. ఎన్నడూ భార్యను అక్కడికి తీసుకెళ్లలేదు. ఇంకా.. అతనో డాక్టర్ అని చెప్తాడు కానీ.. అందుకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు ఏవీ లేవు. విదేశాల్లో చదువుకున్నానని చెప్పావు కదా.. అక్కడి ఫొటోలు ఏమైనా చూపించమంటే.. ఏవీ లేవన్నాడు. మరో కీ పాయింట్ ఏమంటే.. అహ్నాఫ్ ఛాతి ఆడవాళ్ల మాదిరిగా ఎత్తుగా కనిపిస్తూ ఉండేది. ఎందుకిలా అని అడిగితే.. హార్మోనల్ ప్రాబ్లం అని చెప్పాడు.

తల్లీ కూతుళ్ల అనుమానం పీక్ స్టేజ్ కు చేరింది. దీంతో.. "ఈ రోజు ఎలాగైనా అటో ఇటో తేల్చేయాలి.. డౌట్ క్లియర్ చేసేయాలి.." అని అత్తగారు డిసైడ్ అయ్యారు. డ్యూటీకి వెళ్లిన అల్లుడు గారు.. సాయంత్రం ఇంటికి వచ్చారు. టవల్ తీసుకొని బాత్ రూమ్ వైపు వెళ్తుండగా.. "అల్లుడు గారు ఒక్క మాట" అన్నారు అత్తగారు. "మీరెందుకు ప్యాంట్, షర్ట్ కూడా బాత్ రూమ్ లోకి వెళ్లి విప్పుతున్నారు? ఇక్కడ వేసి వెళ్లొచ్చు కదా?" అని అడిగారు. కంగారు పడిన అల్లుడు గారు.. "అంటే.. మరీ.. ఇప్పుడూ.." అంటూ ఏదో సమాధానం చెప్పబోయారు. దానికి.. "కుదరదు ఇక్కడే విప్పాలి.. మా ముందే విప్పాలి.." అన్నది అత్త.

"ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు అల్లుడు గారు" కానీ తప్పలేదు. మరో మార్గం లేకపోవడంతో.. అనివార్యంగా షర్ట్ విప్పేశాడు. దగా.. దారుణం.. మోసం.. "అల్లుడు గారు కాదు.. ఇంట్లో కొడుకు ఉంటే.. కోడలు అయ్యేది"! అవును.. ఇన్నాళ్లూ వాళ్లను అల్లుడిగా.. NAను భర్తగా నమ్మించి మోసం చేసింది ఒక ఆడపిల్ల. ఎందుకిలా చేశావని అడిగితే.. డబ్బు కోసమే మోసం చేశానని చెప్పింది.. మరి, "నీ డాక్టరేట్ సంగతి?" అని అడిగితే.. తాను కాంపౌండర్ కూడా కాదు అని చెప్పింది. తన అసలు పేరు "ఎరయా" అని ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేసింది.

పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. మొగుడు ఒక అమ్మాయి అని

ఈ మోసాన్ని తట్టుకోలేకపోయిన NA.. ఎరయాపై కేసు పెట్టింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. అప్పుడు తన వర్షన్ వినిపించిన NA.. ఎరయా తనను పెళ్లి చేసుకొని 10 నెలల పాటు భర్తగా మోసగించిందని.. అమ్మాయి అనే అనుమానం తనకు ఎన్నడూ రాలేదని.. తన తల్లి ఈ మోసాన్ని గుర్తించిందని చెప్పింది. అంతేకాదు.. డాక్టర్ గా పని చేస్తున్నానని కూడా అబద్ధం చెప్పిందని.. ఇంత మోసం చేసిన ఎరయాను శిక్షించాలని కోర్టును కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం.. ఎరయా మగాడిగా.. మొగుడిగా నటించినందుకన్నా, డాక్టర్ అని చెప్పుకోవడాన్ని పెద్ద నేరంగా పరిగణించింది. ఈ జూన్ 14న ఈ కేసు నమోంది. విచారణ కొనసాగుతోంది.

ఇవన్నీ సరేగానీ.. 10 నెలల పాటు ఇద్దరు ఆడవాళ్లు ఎలా కాపురం చేశారు? భార్యగా ఉన్న NAకు.. ఎరయాపై ఎందుకు డౌట్ రాలేదు? మగాడిగా ఎరయా ఎలా మేనేజ్ చేసింది? అంటారా? ఏవేవో బొమ్మలు వాడేసిందట..!!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

Last Updated : Sep 19, 2022, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details