బంగాళాఖాతంలో రెండు రోజులుగా జరుగుతున్న భారత్ - రష్యా నౌకాదళ సంయుక్త విన్యాసాలు ముగిశాయి. ఇంద్ర నేవీ 2020 పేరిట విన్యాసాల్లో రెండు నౌకా దళాల నౌకలు, హెలికాప్టర్లు శక్తిసామర్థ్యాలు ప్రదర్శించాయి.
ముగిసిన భారత్ - రష్యా నౌకాదళ సంయుక్త విన్యాసాలు - Indo-Russian naval joint maneuvers in bay of bengal news
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో.. బంగాళాఖాతం తీరంలో రెండు రోజులుగా జరిగిన భారత్ - రష్యా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు ముగిశాయి. ఇంద్ర నేవీ 2020 పేరిట నిర్వహించిన ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నౌకలు, హెలికాప్టర్ లు సత్తా చాటాయి.
ముగిసిన భారత్ - రష్యా నౌకాదళ సంయుక్త విన్యాసాలు
భారత యుద్ధ నౌకలు రణ్ విజయ్, శక్తి.. రష్యా ఫెడరల్ నేవీకి చెందిన అడ్మిరల్ వినో గ్రదొవ్, అడ్మిరల్ ట్రిబ్యూట్, బొరిస్ బుతొమా సత్తా చాటాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగన తలానికి ఫైరింగ్ విన్యాసాలు, హెలీకాప్టర్ ఆపరేషన్లు, సీమెన్ షిప్ మదింపు, యాంటీ ఎయిర్ డ్రిల్స్, క్రాస్ డెక్ ఫ్లైయింగ్ వంటివి నిర్వహించారు.