చిన్నారుల ప్రాణాలను బలికొంటున్న భయంకరమైన వ్యాధుల్లో తలసేమియా ఒకటని ప్రముఖ నటుడు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో పాల్గొనాలని కోరారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గమన్నారు.