రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాల్లో ఒక జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంఘం చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ లేఖ రాశారు. అనేక రంగాల్లో ఆయన విశేష సేవలందించిన పీవీ నరసింహారావు పేరును ఓ జిల్లాకు పెట్టడం ఆయనకిచ్చే గౌరవమని పేర్కొన్నారు.
'సీఎం గారూ... కొత్త జిల్లాల్లో ఒకదానికి పీవీ పేరు పెట్టండి' - Indo American Brahmin Association letter to CM jagan
దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేసిన సేవలకు గుర్తుగా... ఏపీలో కొత్తగాఏర్పాటు చేయబోయే జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ఏపీ సీఎం జగన్‌కు సంఘం చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ లేఖ రాశారు.
'సీఎం గారూ... కొత్త జిల్లాల్లో ఒకదానికి పీవీ పేరు పెట్టండి'
విద్యారంగంలో నరసింహారావు తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమని తెలిపారు. తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారని కొనియాడారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా.. ఆయన్ను స్మరించుకోవడంతో పాటు ఆయన దేశానికి చేసిన సేవలను భావి తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.