తెలంగాణ

telangana

ETV Bharat / city

GannaVaram Airport : గులాబ్ ఎఫెక్ట్... గన్నవరంలో గాల్లోనే విమానం.. ప్రయాణికుల టెన్షన్ - ggulab cyclone effect on gannavaram airport

indigo plane
indigo plane

By

Published : Sep 27, 2021, 9:22 AM IST

Updated : Sep 27, 2021, 1:19 PM IST

09:20 September 27

వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం

గులాబ్ ఎఫెక్ట్

ఏపీపై గులాబ్ తుపాను(Cyclone Gulab Effect) తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా దీని ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అవుతోంది. ఆ రాష్ట్రంలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బలంగా వీస్తున్న ఈదురు గాలులతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు విజయవాడ పరిధిలోని గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. వర్షంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు వీలులేక గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన విమానం.. సుమారు అరగంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం విమానం ల్యాండ్​ కావడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

గులాబ్ తుపాన్(Cyclone Gulab Effect) ప్రభావంతో ఏపీలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఫలితంగా రెండు చోట్ల గోడలు, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయాయి. మరోచోటు కొండచరియలు విరిగిపడి మహిళ మృతి చెందింది. 

శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం గడ్డకంచరంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలి 7 ద్విచక్ర వాహనాలు, 10 సైకిళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం రాత్రి సమయంలో జరగడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. తుపాన్(Cyclone Gulab Effect) ప్రభావంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మూడు వందల వరకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతోపాటు లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలంలో ఎక్కడికక్కడ కాలనీలు నీటమునిగాయి. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, పలు వాణిజ్య పంటలు నేలమట్టమయ్యాయి.

Last Updated : Sep 27, 2021, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details