ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకున్న దాదాపు 70 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను కోరారు. స్వదేశానికి వెళ్లాలంటే వైద్యాధికారుల నుంచి కరోనా లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారని, కానీ ఆస్పత్రుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వటం లేదని ఇటలీలో చిక్కున్న భారతీయులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.
ఆ 70 మందిని స్వదేశానికి తీసుకురండి: కేటీఆర్ ట్వీట్
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ఇటలీ విమానాశ్రయంలో చిక్కున్న భారతీయలను స్వదేశానికి తీసుకురావాలని విన్నవించారు.
ప్లీజ్ హెల్ప్ చేయ్యండి...మమ్ముళ్లి కాపాడండి
24 గంటల నుంచి రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నామని, కనీసం భోజన సౌకర్యం కూడా అందుబాటులో లేదని వారు వాపోయారు. భారత ప్రభుత్వ అధికారులు సహాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. దీనికి స్పందించిన కేటీఆర్ సహాయం చేయ్యాల్సిందిగా విన్నపిస్తూ.. విదేశాంగ శాఖ మంత్రికి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:రేపటి నుంచి అన్ని రకాల వీసాలు బంద్..!