కొవిడ్ రెండో దశను ఎదుర్కోవడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ కొవిడ్ రక్షిత ఐసోలేషన్ కోచ్‌లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న కొవిడ్ రోగుల ఐసోలేషన్ కోసం అదనపు రక్షిత కోచ్‌లను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీలో కొవిడ్ రక్షిత కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. పంజాబ్‌లో వీటి ఏర్పాటు కోసం కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
కొవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే
కరోనా రక్షిత ఐసోలేషన్ కోచ్‌లను భారతీయ రైల్వే తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న కొవిడ్ రోగుల ఐసోలేషన్ కోసం అదనపు రక్షిత కోచ్‌లను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే ప్రకటించింది.
మరిన్ని ఐసోలేషన్ కోచ్‌ల ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల కొవిడ్ రక్షిత కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. దిల్లీలోని షాకూర్ బస్తీ స్టేషన్లో 800ల పడకలతో 50 కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింది. ఆనంద్ విహార్ టర్మినల్లో 400 పడకలతో 25 కోచ్‌లను, మహారాష్ట్రలోని నందూర్ బార్లో 378 పడకలతో 21 కోచ్‌లు, భోపాల్ స్టేషన్లో 40 కోచ్‌లు, పంజాబ్‌లో 50 కోచ్‌లు సిద్ధంగా ఉంచామని భారతీయ రైల్వే వెల్లడించింది.
ఇదీ చదవండి: 'కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే లక్ష్యం'