weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశాగా కదులుతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఈశాన్యంగా 230 కిలోమీటర్లు, గోపాల్ పూర్కు 90 కిలోమీటర్లు, పూరికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. మధ్యాహ్నానికి పూరికి దగ్గరగా వాయుగుండం వెళ్తుందని..., సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
weather updates: సాయంత్రానికి అల్పపీడనంగా మారనున్న వాయుగుండం! - telangana latest updates
TAGS : WEATHER UPDATE , WEATHER UPDATE TODAY , HYDERABAD WEATHER TODAY, weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశా కదులుతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాయుగుండం సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది.
సాయంత్రానికి అల్పపీడనంగా మారనున్న వాయుగుండం
TAGS : WEATHER UPDATE , WEATHER UPDATE TODAY , HYDERABAD WEATHER TODAY
ఇదీ చదవండి:Omicron Delhi: భారత్లో ఐదో ఒమిక్రాన్ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ
Last Updated : Dec 5, 2021, 4:44 PM IST