హైదరాబాద్ వేదికగా సాగిన గేమింగ్, మీడియా, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం 'ఇండియా జాయ్' సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో 30 వేలకు పైగా ఔత్సాహికులు, దేశ విదేశాల నుంచి సుమారు 50 వేల మంది యువత సదస్సుకు హాజరయ్యారు. హెచ్ఐసీసీ వేదికగా డిజిటల్ మీడియాకు సంబంధించిన పలువురు ప్రముఖులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
బాహుబలి గ్రాఫిక్స్‌పై..
వివిధ దేశాల ప్రతినిధుల నుంచి ఓటీటీ ప్లాట్ ఫాం, దాని ఉపయోగాలు, గ్రాఫిక్స్‌కు సంబందించిన టూల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వీఎఫ్ఎక్స్, ఓటీటీ సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాహుబలి, కాలా, రోబో-2 వంటి చిత్రాల్లో ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ సాంకేతికపై విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు.