కొవిడ్ నిరోధక దేశీయ టీకా అభివృద్ధిలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) కీలక పాత్ర పోషించింది. టీకా పనిచేసేందుకు కావాల్సిన రసాయన పదార్థాన్ని రికార్డు సమయంలో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా పంపిణీ ప్రక్రియ నడుస్తోంది. ఈ టీకాను శరీరంలోకి ప్రవేశపెట్టాక రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలో అగోనిస్ట్ అనే మూలకం అత్యంత ప్రధానపాత్ర వహిస్తుంది. ఆ మూలకం కోసం ఒక రసాయన పదార్థం (టీఎల్‌ఆర్ 7/8) పెద్ద ఎత్తున అవసర పడింది.
కొవిడ్ టీకా అభివృద్ధిలో ఐఐసీటీ కీలక పాత్ర - telangana news
కొవిడ్ నిరోధక దేశీయ టీకా పనిచేసేందుకు కావాల్సిన రసాయన పదార్థాన్ని రికార్డు సమయంలో అభివృద్ధి చేసి కీలక పాత్ర పోషించింది.. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలో అత్యంత ప్రధాన పాత్ర వహించే అగోనిస్ట్ మూలకం కోసం టీఎల్‌ఆర్ 7/8 రసాయనాన్ని ఐఐసీటీ అభివృద్ధి చేసింది.
భారత్ బయోటెక్ సంస్థ వెంటనే ఐఐసీటీని సంప్రదించగా.. డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ నేతృత్వంలో సీనియర్ ప్రిన్స్‌పల్ సైంటిస్ట్ డాక్టర్ రాజిరెడ్డి బృందం నాలుగు నెలలు శ్రమించి ఆ రసాయన పదార్థాన్ని అభివృద్ధి చేసింది. మరో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మోహన్‌కృష్ణ బృందం ఆ పదార్థాన్ని పరీక్షించే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇలా రికార్డు సమయంలో ఐఐసీటీ ఈ సాంకేతికతను భారత్ బయోటెక్‌కు అందజేసి వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించింది. అగోనిస్ట్ కోసం ఐఐసీటీ అభివృద్ధి చేసిన రసాయన పదార్థం సాంకేతికత.. టీకా తయారీలో కీలకంగా వ్యవహరించిందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తమ ప్రయోగశాలల నిబద్ధతకు ఇది నిదర్శనమని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండె పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : 'వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా టీకా'