తెలంగాణ

telangana

ETV Bharat / city

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు - indian independence day celebrations 2021 news

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. గల్ఫ్​ దేశాల్లోని తెలుగు సంఘాలు కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని.. తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్​ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కువైట్​లోని భారత రాయభారి సిబి జార్జి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​ నాయుడు, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి హాజరయ్యారు.

Indian independence day 2021
Indian independence day 2021

By

Published : Aug 18, 2021, 11:55 AM IST

Updated : Aug 18, 2021, 12:02 PM IST

75వ స్వాతంత్య్ర వేడుకలను గల్ఫ్​లోని తెలుగు సంఘాలు ఘనంగా నిర్వహించాయి. తెలుగు సంఘాల ఐక్య వేదిక-కువైట్​ ఆధ్వర్యంలో వర్చవల్​గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 8 తెలుగు సంఘాల భాగస్వామ్యమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కువైట్​లోని భారత రాయభారి సిబి జార్జి హాజరయ్యారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు ప్రత్యేక అతిథిగా.. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

75వ స్వాతంత్య్ర వేడుకలను గల్ఫ్​ దేశాల్లోని తెలుగు సంఘాలు కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని.. తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్​ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. ఈ కార్యక్రములో భాగస్వాములైన తెలుగు కళాసమితి- బహరైన్, తెలుగు కళా సమితి- ఒమన్, ఆంధ్ర కళావేదిక-ఖతార్, తెలుగు అసోసియేషన్- సౌదీ అరేబియా, తెలుగు కళాస్రవంతి-అబుదాబి, తెలుగు కుటుంబాలు-ఫుజైరియ, తెలుగు తరంగిణి... సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

కష్టకాలంలో ఉన్న సురభి నాటకరంగానికి చేయూతనిచ్చేందుకు.. ప్రతినెల ఒకొక్క తెలుగు సంఘం ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన ఏర్పాటుచేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.

ఇదీచూడండి:నింగి, నేల, సంద్రంపై మెరిసిన మువ్వన్నెల జెండా

Last Updated : Aug 18, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details