తెలంగాణ

telangana

By

Published : Sep 4, 2020, 5:26 PM IST

ETV Bharat / city

సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ ఛాలెంజ్‌.. రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక

పర్యావరణ పరిరక్షణ కొరకు ఇండియా సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. సైకిల్‌ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా కేంద్రం ఈ కార్యక్రమం రూపొందించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 95 సైక్లింగ్‌ ఫ్రెండ్లీ సిటీలను ఎంపిక చేసింది. రాష్ట్రం నుంచి మూడు నగరాలు ఎంపికయ్యాయి.

indian cycle for Change Challenge in telangana
సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ ఛాలెంజ్‌.. రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కొరకు... పౌరులు సైకిల్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా ఇండియా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోంది. సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీలో హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ నగరాలను కేంద్రం ఎంపిక చేసింది.

గ్రేటర్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హెచ్​ఎమ్​డీఏ, హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ పూర్తి సహకారాన్ని అందించనున్నాయి. మెుదటగా ఖైరతాబాద్ జోన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని జీహెచ్​ఎంసీ నిర్ణయించింది. అందుకు సంబంధించి సైకిల్ ట్రాక్‌ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి :మారుతున్న వానాకాలం- దక్షిణాదిన ఇక భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details