భాగ్యనగరానికి ధోని... అభిమానుల ఘనస్వాగతం - హైదరాబాద్‌లో క్రికెటర్ ధోని
భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని భాగ్యనగరంలో సందడి చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు మాహికి ఘనస్వాగతం పలికారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ధోనికి ఘనస్వాగతం
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హైదరాబాద్‌కు విచ్చేశారు. ముంబయి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మాహికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. ధోని ప్రత్యేక కాన్వాయ్‌లో నగరానికి వెళ్లారు.
- ఇదీ చూడండి : సచిన్ కంటే కోహ్లీ బ్యాట్‌కే వేగమెక్కువ..!