హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు ముగిశాయి. ఐఎన్ఎస్ కొచ్చి, టగ్‌లు, పి 8 ఐ హెలీకాప్టర్లు, మిగ్ 29 కె విమానాలు భారత నౌకాదళం నుంచి పాల్గొన్నాయి. యూఎస్ నేవీ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ రోనాల్డ్ రీగన్, నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రోనాల్డ్ రీగన్, ఆర్లీ బర్క్ క్లాస్ గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ యుఎస్ఎస్ హాల్సే, టికోండెరోగా క్లాస్ గైడెడ్ క్షిపణి క్రూయిజర్ షిప్లు ఈవిన్యాసాల్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఈ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో అబ్బురపరిచేలా తమ శక్తిని చాటాయి.
NAVY: ముగిసిన భారత్-అమెరికా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు - ind usa navy feets in hindu ocean
హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం-అమెరికా నౌకాదళం సంయుక్త విన్యాసాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఇరు దేశాల నౌకాదళాలు అబ్బురపరిచేలా తమ శక్తిని చాటాయి. హిందూ మహాసముద్ర జలాల పరిధిలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంయుక్త ఆపరేషన్లు నిర్వహించినట్టు భారత నౌకాదళం వెల్లడించింది.
ముగిసిన భారత్-అమెరికా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ విన్యాసాలు జరిగాయి. సంయుక్త ఆపరేషన్లలో అధునాతన ఎయిర్ డిఫెన్స్ విన్యాసాలు, క్రాస్ డెక్ హెలీకాప్టర్ ఆపరేషన్లు, యాంటీ సబ్మెరైన్ ఎక్సర్సైజులు నిర్వహించారు. హిందూ మహాసముద్ర జలాల పరిధిలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంయుక్త ఆపరేషన్లు నిర్వహించినట్టు భారత నౌకాదళం వెల్లడించింది.
ఇదీ చదవండి: మన మాటలు 'స్మార్ట్ఫోన్' నిజంగా వింటోందా?