తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రగతిభవన్​లో జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్​... - independence day news

రాష్ట్రంలో ఈ సారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగనున్నాయి. పరేడ్‌ మైదానంలో సైనిక స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం.... ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించనున్నారు. జిల్లాల్లోనూ ఆడంబరాలకు దూరంగా వేడుకలు జరుపుకోకున్నారు.

independence day celebrations in Hyderabad
independence day celebrations in Hyderabad

By

Published : Aug 15, 2020, 4:29 AM IST

Updated : Aug 15, 2020, 6:02 AM IST

కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో నిరాడంబరంగా జరుగనున్నాయి. ఏటా ఆగస్టు 15న గోల్కొండ కోట వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయజెండాను ఆవిష్కరించనుండగా.... ఈసారి కార్యక్రమాన్ని ప్రగతిభవన్‌కు పరిమితం చేశారు. ఉదయం10 గంటలా 15 నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్‌ మైదానం వద్దనున్న వీరుల సైనిక స్మారకం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు ఎలాంటి ఆడంబరాలు లేకుండానే జరగనున్నాయి. మంత్రులు, ప్రముఖులు ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తారు. కొవిడ్ నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని..... మార్గదర్శకాలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో గవర్నర్ తమిళిసై దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?

Last Updated : Aug 15, 2020, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details