తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్ని జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు సర్కారు నిర్ణయం - independence day celebrations telangana

అన్ని జిల్లాల్లో స్వతంత్ర దినోత్సవ నిర్వహణకు సర్కారు నిర్ణయం
అన్ని జిల్లాల్లో స్వతంత్ర దినోత్సవ నిర్వహణకు సర్కారు నిర్ణయం

By

Published : Aug 12, 2020, 6:26 AM IST

Updated : Aug 12, 2020, 9:43 AM IST

06:19 August 12

అన్ని జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు సర్కారు నిర్ణయం

కొవిడ్​ నేపథ్యంలో ఆగస్టు 15 వేడుకలపై నీలినీడలు అలుముకున్న తరుణంలో సర్కారు స్పష్టతనిచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో వేడుకల నిర్వహించాలని ఆదేశించింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే  ప్రముఖుల పేర్లను కూడా సర్కారు ఖరారు చేసింది.

 రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 10.30గం.లకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద మంత్రులు, కేబినెట్ ర్యాంక్ ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఎగరువేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారివారి కార్యాలయాల వద్ద ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఎగరవేయాలని సూచించింది. అనంతరం ఎమ్మెల్యేలు, మేయర్లు, జెడ్పీ ఛైర్ పర్సన్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం తెలిపింది.  కొవిడ్‌ నిబంధనలకు లోబడి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జిల్లాల వారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రముఖులు..

  1. ఆదిలాబాద్‌ - ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
  2. భద్రాద్రి కొత్తగూడెం - ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు
  3. జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  4. జయశంకర్‌ భూపాలపల్లి - ప్రభుత్వ విప్‌ భాను ప్రసాదరావు
  5. జనగామ - ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు
  6. జోగులాంబ గద్వాల - ప్రభుత్వ విప్‌ దామోదర్‌ రెడ్డి
  7. కామారెడ్డి - స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
  8. ఖమ్మం - మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
  9. కరీంనగర్‌ - మంత్రి గంగుల కమలాకర్‌
  10. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ - ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ
  11. మహబూబ్‌నగర్‌ - మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  12. మహబూబాబాద్‌ - మంత్రి సత్యవతి రాథోడ్‌
  13. మంచిర్యాల - ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
  14. మెదక్‌ - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  15. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి - మంత్రి మల్లారెడ్డి
  16. ములుగు - ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు
  17. నాగర్‌కర్నూల్‌ - ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు
  18. నల్లగొండ - మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
  19. నారాయణపేట - మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌
  20. నిర్మల్‌ - మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
  21. నిజామాబాద్‌ - మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
  22. పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్‌
  23. రాజన్న సిరిసిల్ల - మంత్రి కేటీఆర్‌
  24. రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  25. సంగారెడ్డి - మంత్రి మహముద్‌ అలీ
  26. సిద్దిపేట - మంత్రి హరీశ్​ ‌రావు
  27. సూర్యాపేట - మంత్రి జగదీశ్​‌ రెడ్డి
  28. వికారాబాద్‌ - డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు
  29. వనపర్తి - మంత్రి నిరంజన్‌ రెడ్డి
  30. వరంగల్‌ రూరల్‌ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  31. వరంగల్‌ అర్బన్‌ - ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ భాస్కర్‌
  32. యాదాద్రి భువనగిరి - ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి

ఇవీ చూడండి:కొత్త సచివాలయ భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ సిద్ధం

Last Updated : Aug 12, 2020, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details