రాష్ట్ర అసెంబ్లీ వద్ద 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత మహత్మా గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం మధ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు, నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.
'అసెంబ్లీ వద్ద ఘనంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు' - 74వ స్వాతంత్ర్య వేడుకలు
అసెంబ్లీ వద్ద 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జాతిపితకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అసెంబ్లీ వద్ద ఘనంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమైందని పోచారం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందే తాను స్వాతంత్ర్యం ఫలాలు అందరికి అందలేదని అభిప్రాయం వ్యక్తం చేశానని గుర్తుచేశారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా జీవించే దిశగా.. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చూడండి:స్వాతంత్ర్య వేడుకల్లో ఈసారి హైలైట్స్ ఇవే...
Last Updated : Aug 15, 2020, 9:06 AM IST