తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా నిబంధనల ఎత్తివేత తర్వాత ఏపీలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు' - సుప్రీం కోర్టు రహదారి భద్రతా కమిటీ తాజా వార్తలు

కరోనా ఆంక్షల ఎత్తివేత తర్వాత ఏపీలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు పెరిగాయని సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీ నివేదికలో వెల్లడించింది. 2019 పోలిస్తే 19.4 శాతం మేర మరణాలు పెరిగాయని పేర్కొంది. వ్యక్తిగత వాహనాలు భారీగా పెరగటమే ప్రమాదాలకు కారణమని కమిటీ అభిప్రాయపడింది.

increasing road accidents in ap after corona
'కరోనా నిబంధనల ఎత్తివేత తర్వాత ఏపీలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు

By

Published : Dec 16, 2020, 11:00 PM IST

కరోనా నిబంధనల ఎత్తివేత తర్వాత ఏపీలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరిగినట్టు సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్-నవంబర్ వరకు 5,188 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. దానిలో 2,073 మంది మృతి చెందినట్లు పేర్కొంది. గతేడాది 4,761 రహదారి ప్రమాదాల్లో 1,734 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019 పోలిస్తే ఈ ఏడాది 19.4 శాతం మేర మరణాలు పెరిగాయి.

లాక్‌డౌన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు 78 శాతం తగ్గాయి

మార్చి-జూన్ మధ్య లాక్‌డౌన్ కారణంగా ప్రమాదాలు 78 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. ఆంక్షలు తొలగించిన కొద్దీ ప్రమాదాలు పెరిగాయని.. వ్యక్తిగత వాహనాలు భారీగా పెరగటమే ప్రమాదాలకు కారణమని అభిప్రాయపడింది. కరోనా భయంతో ప్రజారవాణా వినియోగం భారీగా తగ్గినట్లు స్పష్టం చేసింది. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించి నివారించాలని కమిటీ సూచించింది. రహదారి భద్రతా ఆడిట్‌ను తప్పనిసరి చేయాలని నివేదికలో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details