తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసు, ఇతర యూనిఫామ్‌ సర్వీసులకు గరిష్ఠ వయోపరిమితి పెంపు.. - 3 years age relaxation for police jobs in telangana'

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియామకాల్లో పలు శాఖల్లో ఉద్యోగార్థుల వయో పరిమితిని సడలించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక భద్రత దళం తదితర యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగాలకు వయోపరిమితిని మూడేళ్లు పెంచూతూ ఉత్తర్వులు జారీ చేసింది.

increased the maximum age relaxation for police and other uniform services for 3 years
increased the maximum age relaxation for police and other uniform services for 3 years

By

Published : Apr 14, 2022, 9:17 AM IST

రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక భద్రత దళం తదితర యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగాలకు వయోపరిమితిని మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం బుధవారం(ఏప్రిల్​ 13న) ఉత్తర్వులు (జీవో నం.48) జారీచేసింది. ప్రత్యక్ష నియామకాలకు రెండేళ్ల పాటు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.

  • కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. ఇకపై ఈ పరిమితి 25 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రస్తుతం 27 సంవత్సరాలుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి 30కి పెరుగుతుంది.
  • ఎస్సై ఉద్యోగాలకు కనిష్ఠ వయసు 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లుగా ఉంది. ఇకపై ఇది 28 ఏళ్లకు చేరుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం 30 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉండగా.. ఇకపై 33 అవుతుంది.
  • డీఎస్పీ పోస్టులకు కనిష్ఠ వయోపరిమితి 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 30గా ఉంది. ఇకపై అది 33 అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 35 నుంచి 38 ఏళ్లకు పెరుగుతుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details