తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్టోబర్ చివర వరకు ఐటీ రిటర్నుల దాఖలుకు అవకాశం - it returns

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను ఆడిట్ దాఖలు చేసే తేదీని అక్టోబర్ చివర వరకు పొడిగించింది.

అక్టోబర్ చివర వరకు ఐటీ రిటర్నుల దాఖలుకు అవకాశం
అక్టోబర్ చివర వరకు ఐటీ రిటర్నుల దాఖలుకు అవకాశం

By

Published : Jul 30, 2020, 5:27 AM IST

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. పన్ను ఆడిట్ దాఖలు చేసే తేదీని అక్టోబర్ చివర వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన "వివాద్‌ సే విశ్వాస్‌'' పథకం కింద వడ్డీ, జరిమానాలు లేకుండా పాత బకాయిల కేసులను పరిష్కరించుకోవడానికి ఈ ఏడాది డిసెంబర్‌ వరకు సమయం ఇచ్చారు.

నగదు లావాదేవీలను తగ్గించి, డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు చట్టంలో తెచ్చిన సవరణలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. వరుసగా మూడేళ్లు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయకుండా.... ఈ ఆర్థిక ఏడాది నుంచి రూ.20 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే రెండు శాతం, రూ.కోటి దాటి లావాదేవీలు జరిపితే అయిదు శాతం లెక్కన టీడీఎస్​ను బ్యాంకులే ఆయా ఖాతాల నుంచి మినహాయించుకుంటాయి.

ఇవీ చూడండి:మొక్కజొన్న ఊక నుంచి కార్బన్ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేసిన ఐఐటీ-హెచ్

ABOUT THE AUTHOR

...view details