వికారాబాద్ జిల్లాలో గొప్పనాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు ప్రగతిభవన్లోనే నాయకులు ఉన్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా లోపం ఉందని ఎద్దేవా చేశారు.
పురపాలక ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు తథ్యం..! - Telangana municipal elections today news
పురపాలక ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు తథ్యమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగులు, మైనార్టీలు మద్దతు ఇచ్చినట్లు ఈసారి అండగా నిలవాలని కోరారు. వికారాబాద్‌లో 34 మున్సిపల్ స్థానాలకు.. 25స్థానాలు కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు.
పురపాలక ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు తథ్యం..!
వార్డు స్థాయిలో కలసికట్టుగా పనిచేస్తే.. ప్రతి జిల్లాలో హస్తం గెలుపు సునాయాసమని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఉద్యోగులు, మైనార్టీలు మద్దతు ఇచ్చినట్లు ఈసారి అండగా నిలవాలని కోరారు. వికారాబాద్‌లో 34మున్సిపల్ స్థానాలకుగాను.. 25స్థానాలు కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు.