తెలంగాణ

telangana

ETV Bharat / city

సికింద్రాబాద్​లో రూ. 6 కోట్లతో స్కై వాక్ బ్రిడ్జి నిర్మాణం

సికింద్రాబాద్​లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓలిఫెంటా బ్రిడ్జి సమీపంలో 6 కోట్ల రూపాయలతో స్కై వాక్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ, జీహెచ్ఎంసి, మెట్రో అధికారులు స్థలాన్ని సందర్శించారు.

In Secunderabad Rs. Sky Walk Bridge construction with 6 coats
సికింద్రాబాద్​లో రూ. 6 కోట్లతో స్కై వాక్ బ్రిడ్జి నిర్మాణం

By

Published : Nov 28, 2019, 2:21 AM IST


సికింద్రాబాద్​లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఓలిఫెంటా బ్రిడ్జి సమీపంలో 6 కోట్ల రూపాయలతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, మెట్రో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. స్కై వాక్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు మున్సిపాల్​ అధికారులు తెలిపారు. ఇక నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

సికింద్రాబాద్​లో రూ. 6 కోట్లతో స్కై వాక్ బ్రిడ్జి నిర్మాణం

ట్రాఫిక్ నియంత్రణ - ప్రణాళిక

  • బోయగూడ రైల్వే స్టేషన్, సంగీత్ టాకీస్ నుంచి ఒలిఫెంటా వైపు వచ్చే వాహనాలు... మెట్టుగూడ రైల్వే క్వార్టర్ మీదుగా సికింద్రాబాద్​కు వచ్చే వాహనాలకు ఇబ్బంది కలగకుండ స్కై వేలో పాదచారులు వెళ్లేందుకు రూపకల్పన చేస్తున్నారు.
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్లు.. ఉప్పల్, మెట్టుగూడ, తార్నాక వైపు వెళ్లే పాదచారులు స్కై వాక్ మీదుగా చిలకలగూడ చౌరస్తాలో ఉప్పల్ వైపు బ్రిడ్జి దిగి బస్​స్టాప్​కు వెళ్లే విధంగా సిద్ధం చేస్తున్నారు.
  • రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details