తెలంగాణ

telangana

ETV Bharat / city

కుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లి

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ ఘటన మరువకముందే... అలాంటిదే మరొకటి జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పీఎస్‌ వద్ద ఓ మహిళ శానిటైజర్ తాగింది. తన కుమారుడు చిరంజీవిని ఎస్సై కొట్టారని... ఎస్సై తీరుకు నిరసనగా యర్రమ్మ అనే మహిళ శానిటైజర్ తాగింది.

కుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లి
కుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లికుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లి

By

Published : Aug 6, 2020, 4:39 PM IST

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పీఎస్‌ వద్ద ఓ మహిళ శానిటైజర్ తాగింది. తర్లిబొడ్డపాడుకు చెందిన యర్రమ్మ, కల్పన మధ్య ఘర్షణ జరగ్గా... కులం పేరుతో దూషించారని కల్పన అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యర్రమ్మను, ఆమె కుమారుడిని ఎస్సై లక్ష్మణరావు స్టేషన్‌కు పిలిచారు. యర్రమ్మ కుమారుడు చిరంజీవిని ఎస్సై కొట్టారని... ఎస్సై తీరుకు నిరసనగా యర్రమ్మ శానిటైజర్ తాగింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

కుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లి

ABOUT THE AUTHOR

...view details