తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలుగు భాషలో ఉన్న రసజ్ఞత మరే భాషలో లేదు' - ఆన్​లైన్ ద్వారా తెలుగు సాహిత్య అభిమానుల సమావేశం

తెలుగుతల్లి మాసపత్రిక, టొరంటో తెలుగు టైమ్స్‌ అధ్యర్యంలో.. తెలుగు సాహిత్య అభిమానులు ఒక్కరోజుపాటు.. సాహిత్య అభిరుచులు పంచుకున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా కవులు, రచయితలు కవితలు, సాహిత్యంతో పాటు పలు అంశాలపై చర్చించారు.

TELUGU
TELUGU

By

Published : Apr 4, 2021, 10:18 AM IST

'తెలుగు భాషలో ఉన్న రసజ్ఞత మరే భాషలో లేదు'

తెలుగుతల్లి మాసపత్రిక ఆధ్వర్యంలో కెనడాలో ఆన్‌లైన్‌ వేదికగా ఒక్కరోజు సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. కెనడాలో.. స్థిరపడిన తెలువారు, మాతృబాషపై మక్కువతో.. టొరంటో తెలుగు టైమ్స్‌, తెలుగుతల్లి మాసపత్రిక వారి ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యాన్ని మననం చేసుకున్నారు. సాహిత్యాన్ని..తెలుగు పురాణాల్లో గాధలను వినిపించారు.

1985 ఏర్పడిన తెలుగుతల్లి మాసపత్రిక.. 2017లో పునర్‌ నిర్మితమైందని నిర్వాహకులు చెప్పారు. టొరంటో సాహిత్య పత్రిక ఏడాది పూర్తిచేసుకుందని తెలిపారు. ఈ రెండు పత్రికల తెలుగు సాహిత్యాన్నిమరింత ఇనుమడింప చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొందరు ప్రస్తుత పరిస్థితులపై కవిత్వం చెబితే.. మరికొందరు ప్రాచీన కాలంలోని విశేష కట్టాడాల గూరించి వర్ణించారు.

తెలుగు భాషలో ఉన్న రసజ్ఞత మరే భాషలో లేదని..తెలుగుతల్లి మాసపత్రిక సభ్యులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాషకు ఉన్న గొప్పతనమే.. తమని మరింతగా ఆ భాషపై మక్కువ పెంచుకునేందుకు తోడ్పడుతోందన్నారు.

ఇదీ చూడండి:ఆ ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్ సేవలు: ఈటల

ABOUT THE AUTHOR

...view details