ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో ఎలుగు బంటి కలకలం సృష్టించింది. సోమవారం వేకువజామున ఉదయపు వ్యాహ్యాలి కోసం వెళ్లిన కొంతమంది మహిళలకు ఓ ఎలుగుబంటి తారసపడింది. తాజాగా మంగళవారం ఉదయం... కొండ ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్ సమీపంలో ఎలుగు సంచరిస్తుండటం వల్ల విద్యార్థులు, ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్నకొన్ని శునకాలు భల్లూకాన్ని తరిమేయటంతో విద్యార్థులతో పాటు ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించగా... ఈ వీడియో వైరల్గా మారింది.
ఎలుగుబంటిని తరిమికొట్టిన శునకాలు.. వీడియో వైరల్ - dogs attack on bear in kalyanadurgam ananthapuram
స్థానికులను భయపెడుతున్న ఎలుగుబంటిని శునకాలు తరిమికొట్టిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది.

ఎలుగు బంటిని తరిమికొట్టిన శునకాలు.. వీడియో వైరల్