ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలటం వల్ల కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపు నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం - పూళ్లలో రోడ్డు ప్రమాదం
వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాబోయే రోజుల్ని తలచుకుంటూ మురిసిపోయారు. కానీ.. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. నూతన దంపతులతో పాటు వధువు సోదరుడు దుర్మరణం పాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం
ప్రమాదంలో కారులో ఉన్న నవదంపతులతోపాటు వధువు సోదరుడు మృతి చెందారు. వీరు తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి :హాజరు కాలేని విషాద పరిస్థితులు.. బరువెక్కిన హృదయాలు