తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాలల వర్చువల్ నాటకోత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు తమ నటనతో కళాప్రియుల మదిని దోచుకుంటున్నారు. వివిధ నాటక అంశాలను ప్రదర్శిస్తూ అభినందనలు అందుకుంటున్నారు.
సమాజంలో స్త్రీ విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రదర్శించిన సావిత్రిబాయి నాటకం అందరిని ఆలోచింపజేసింది. దీనికి శ్యామ్ రచన, దర్శకత్వం వహించారు. మహత్మ జ్యోతిరావు ఫూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాల సిద్దిపేట విద్యార్థులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.