మహా శివరాత్రి సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా సంతపేట శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలోని గంగా అన్నపూర్ణసమేత కాశీవిశాలాక్షీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయంలో అర్చకులు యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. 11 రోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో మహా ధన్వంతరీ, మహా మృత్యుంజయం, మహా చండీ యజ్ఞాలను జరపనున్నారు.
ఆకట్టుకున్న హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు - ఆకట్టుకున్న నగలోత్సవ కార్యక్రమం న్యూస్
ఏపీలోని ప్రకాశం జిల్లా సంతపేట శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలోని గంగా అన్నపూర్ణసమేత కాశీవిశాలాక్షీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేరళ నుంచి తీసుకొచ్చిన నాట్యం చేసే హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు విశేషంగా ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు
ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కేరళ నుంచి తీసుకొచ్చిన 24 అడుగుల నాట్యం చేసే హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు విశేషంగా ఆకట్టుకంది. దీన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఇదీ చదవండి: నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల