తెలంగాణ

telangana

ETV Bharat / city

అరకిలోపైగా బరువుతో ఆకర్షిస్తోన్న చామదుంప - యానాం తాాజా వార్తలు

మహా అయితే యాభై లేదా వంద గ్రాములు ఉండే చామదుంప ఏకంగా అరకిలో పైగా బరువుతో అందరినీ ఆకర్షిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంలో ఓ ఇంట్లో 665 గ్రాముల బరువు, 11 అంగుళాల పొడవైన చామదుంప చూపరులను ఆకట్టుకుంటోంది.

impressive-chama-gadda-in puducherry-yanam dist
అరకిలోపైగా బరువుతో ఆకర్షిస్తోన్న చామదుంప

By

Published : Dec 5, 2020, 5:59 PM IST

చామ దుంపలు సాధారణంగా రెండు, మూడు అంగుళాల పొడవు, 50 గ్రాముల బరువు వరకు ఉంటాయి. సాధారణ పరిమాణం కంటే అధికంగా..శంఖు ఆకారంలో కనిపిస్తున్న ఈ చామ దుంప పుదుచ్చేరిలోని యానాంలో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

స్థానిక జీహెచ్ రోడ్డులో కాయగూరల దుకాణం నిర్వహించే కోన సత్తిబాబు కాకినాడ హోల్ సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలలో పెద్ద చామదుంప ఉండడంతో దీనిని ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శిస్తున్నారు. 665 గ్రాముల బరువు,11 అంగుళాల పొడవున పెరగడం చాలా అసాధారణమని, అందుకే ఎవరికీ అమ్మకుండా ఉంచానని సత్తిబాబు తెలిపారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ ఫలితం : స్వల్ప ఆధిక్యంతో అత్యధిక స్థానాలు..

ABOUT THE AUTHOR

...view details