తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం - irrigation principle secretary meeting over central's gezit on water dispute

కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం
కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం

By

Published : Jul 19, 2021, 10:24 AM IST

Updated : Jul 19, 2021, 10:55 AM IST

10:23 July 19

కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం

కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​కుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఈఎన్‌సీలు, అడ్వొకేట్ జనరల్, న్యాయవాదులు పాల్గొంటారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు.. సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ పై విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గెజిట్​లో ఉన్న అంశాలు, విభజన చట్టం, అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టాలు, ఒప్పందాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంజినీర్లు, న్యాయవాదులతో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్​కుమార్ సమావేశమవుతున్నారు.

జల వివాదం

కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపొతల పథకం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమని.. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లెవనెత్తింది. కాదు.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. 

గెజిట్ నోటిఫికేషన్

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో కేంద్ర జల్​శక్తిశాఖ.. రంగంలోకి దిగింది. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై 71 ప్రాజెక్టులూ.. ఆయా బోర్డుల అధీనంలోకి వెళ్తాయని పేర్కొంటూ గెజిట్​ను విడుదల చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయని స్పష్టం చేసింది. వచ్చే అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

ఇవీ చదవండి  :  

gazette notification: 'అన్ని కోణాల్లో అధ్యయనం చేశాకే వైఖరి వెల్లడి!'

Last Updated : Jul 19, 2021, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details