తెలంగాణ

telangana

ETV Bharat / city

'అనుమతి లేని లేఅవుట్లకు నోటీసులు జారీ చేయాలి' - అనుమతి లేని లేఅవుట్లకు నోటీసులు జారీ చేయాలి

ఆంధ్రప్రదేశ్​లో అనుమతి లేని లేఅవుట్లకు తక్షణం నోటీసులు జారీ చేయాలని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి లేఅవుట్​ను పంచాయతీరాజ్, అర్బన్ అథారటీ పర్యవేక్షించాలని నిర్ణయించారు.

immediate-notices-for-unauthorized-layouts-in-ap
'అనుమతి లేని లేఅవుట్లకు నోటీసులు జారీ చేయాలి'

By

Published : Oct 19, 2020, 6:32 PM IST

ఆంధ్రప్రదేశ్​లో అనుమతి లేని లేఅవుట్లకు తక్షణం నోటీసులు జారీ చేయాలని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీ, అర్బన్‌ అథారిటీ పరిధిలోని అనధికార లే అవుట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా వేసిన లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీల్లో 6,049 అనధికారిక లేఅవుట్లు గుర్తించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. అర్బన్ పరిధి పంచాయతీల్లో వచ్చే లే అవుట్​ ఫీజులతో పాటు... కొంత ఫీజును ఆయా పంచాయతీలకు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే పంచాయతీల్లోనూ ఎల్​ఆర్​ఎస్ తీసుకురావాలనే అంశం​పై చర్చ జరిగింది. ప్రతి లేఅవుట్​ను పంచాయతీరాజ్, అర్బన్ అథారటీ పర్యవేక్షించాలని ఈ మేరకు మంత్రులు ఆదేశించారు.

ఇదీ చదవండి:'చెరువు శిఖం భూమిలో రైతు వేదిక నిర్మాణంపై నివేదిక ఇవ్వండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details