రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రానికి బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది.
weather: రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు - నైరుతి రుతుపవనాలు
రాష్ట్రంలో.. రాగల మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణపై ఎస్ తుపాను ప్రభావం లేదని తెలిపింది.
వాతావరణ కేంద్రం
తీరం దాటిన ఎస్ తుపాను.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి ఝార్ఖండ్ పరిసర ప్రదేశాల్లో కేంద్రీకృతమైందని వాతవరణ కేంద్రం వెల్లడించింది. అయితే తెలంగాణపై ఆ తుపాను ప్రభావం లేదని తెలిపింది. నైరుతి రుతుపవనాలు.. ఆగ్నేయ, నైరుతి, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా ప్రవేశించినట్లు పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మాల్దీవులు పరిసర ప్రాంతాల్లో కొంత మేర ప్రవేశించినట్లు ప్రకటించింది.