తెలంగాణ

telangana

ETV Bharat / city

Rains: రాగల మూడు రోజులు వర్షాలు! - ఈనెల 11 అల్పపీడనం

రాగల మూడు రోజులపాటు నైరుతి రుతుపవనాల ఆగమన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

rains in telangana
rains in telangana

By

Published : Jun 7, 2021, 3:25 PM IST

నైరుతి రుతుపవనాలు ఈనెల 6న తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని.. హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(IMD) వెల్లడించింది. మెదక్‌, నల్గొండ, రెంటచింతల, శ్రీహరికోట వరకు ఈ రుతుపవనాలు విస్తరించాయని ప్రకటన జారీచేసింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

నిన్నటి నైరుతి మధ్యప్రదేశ్​ నుంచి మరట్వాడ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఇవాళ బలహీన పడిందన్నారు. ఉపరితల ద్రోణి నేడు.. మరట్వాడ నుంచి నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు వ్యాపించిందని తెలిపారు. అల్పపీడనం సుమారుగా 11న ఉత్తర బంగళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఇవీచూడండి:Water Bills: తప్పులతడక బిల్లులకు అడ్డుకట్ట

ABOUT THE AUTHOR

...view details