తెలంగాణ

telangana

ETV Bharat / city

కావలిలో రాజ్యమేలుతున్న రియల్ మాఫియా, గ్రావెల్ దందా - illegal gravel quarrying in kavali

ఏపీ నెల్లూరు జిల్లా కావలి పురపాలక పరిధిలో రియల్ మాఫియా, గ్రావెల్ దందా రాజ్యం ఏలుతున్నాయి. నాయకుల అండదండలతో గ్రావెల్ అక్రమంగా తరలిపోతుంది. అక్రమంగా వెలుస్తోన్న లేవట్లకు అడ్డులేకుండా పోతోంది. నాయకుల ఒత్తిళ్లలతో అధికారుల చూసిచూడనట్లు వ్యవహరించడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.

కావలిలో రాజ్యం ఏలుతున్న రియల్ మాఫియా, గ్రావెల్ దందా
కావలిలో రాజ్యం ఏలుతున్న రియల్ మాఫియా, గ్రావెల్ దందా

By

Published : Oct 23, 2020, 10:56 PM IST

ఏపీ నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో గ్రావెల్ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రావెల్ అధికంగా లభ్యం అవుతుంది. ఇక్కడి గ్రావెల్​కు గిరాకీ ఎక్కువే. పురపాలక సంఘానికి, చుట్టుపక్కల పంచాయతీలకు పన్ను చెల్లించకుండా అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు.

పట్టపగలే అక్రమ తవ్వకాలు చేస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఏంచేయలేని పరిస్థితి నెలకొంది. కావలి చుట్టుపక్కల ముసునూరు, గాయత్రినగర్, మద్దూరుపాడు, తమ్మలపెంటరోడ్డు, అడవిలక్ష్మీపురం, కొత్తశివాలయం, పాతవూరు, రాజీవ్ నగర్ కాలనీల్లో అనధికారిక లే అవుట్లు వేశారు. ఈ లే అవుట్ల కోసం రోడ్డు పక్కన, చెరువుల్లో అడ్డు అదుపు లేకుండా గ్రావెల్​ తవ్వేస్తున్నారు. ఇటీవల వర్షాలకు ఈ గుంతల్లోకి నీరు చేరి ప్రమాదకరంగా మారాయి.

నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. ల్యాండ్ కన్వర్షన్ లేని భూముల్లోనూ వ్యాపారం సాగిస్తున్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ ఆశ చూపిస్తూ... అనుమతులు లేని, రోడ్లు సరిగా లేని ప్లాట్లను రూ.లక్షలకు విక్రయిస్తున్నారు.

గ్రావెల్​ అక్రమాలకు అడ్డుకట్టవేస్తామని అధికారులు అంటున్నారు. చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: తలసాని

ABOUT THE AUTHOR

...view details