తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - జగద్గిరిగుట్ట తాజావార్తలు

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను అధికారులు కూల్చేశారు. రాజీవ్ గృహకల్ప సముదాయంలో నిర్మిస్తున్న కట్టడాలను పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు కూలగొట్టారు.

రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

By

Published : Nov 15, 2020, 10:04 PM IST

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సముదాయంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజీవ్​ గృహకల్ప సముదాయంలో కొందరు స్థానికులు.. తమ ఇళ్లకు ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై గతంలోనే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు వాటిని కూల్చేశారు.

రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

తాజాగా మరికొందరు బ్లాక్ నంబర్ 37 వద్ద నిర్మాణాలు చేపట్టారు. గుర్తించిన టౌన్​ప్లానింగ్ అధికారులు వాటిని కూల్చేసేందుకు ప్రయత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను వారించారు. బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలను కూల్చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఇదీ చూడండి: ఆర్టీసీని గాడిన పెట్టే వరకు నిద్రపోను: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details