అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మించిన 9 భవనాలు కూల్చివేసినట్టు కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు పాక్షికంగా కూల్చిన నాలుగింటితోపాటు కొత్తగా ఐదు భవనాలు పూర్తిగా నేలమట్టం చేసినట్టు పేర్కొన్నారు.
గురుకుల భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - అక్రమ నిర్మాణాల కూల్చివేత
చందానగర్ సర్కిల్లో గురుకుల ట్రస్ట్ భూముల్లో చేపట్టిన 9 భవనాలు అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ప్రభుత్వ భూముల్లో జరిగే అక్రమ నిర్మాణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు.
గురుకుల భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
మూడు బృందాలు టౌన్ ప్లానింగ్, 11 కంప్రెసర్లు, 3 గ్యాస్ కట్టర్లు, 2 జేసీబీలు ఉపయోగిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా... సర్వే చేసి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో జరిగే అక్రమ నిర్మాణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద