IITH AND BNVI MOU: ఐఐటీ హైదరాబాద్ జపాన్‌కు చెందిన బీయాండ్ నెక్ట్స్ వెంచర్స్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు విద్యా, పరిశ్రమ అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, బీయాండ్ నెక్స్ట్ భారత విభాగం సీఈవో టూషుయోషి ఇటో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఆవిష్కరణలు, ఎంట్రపెన్యూయర్షిప్లలో తన ప్రత్యేకత చాటుకుంటున్న ఐఐటీ హైదరాబాద్.. ఈ ఒప్పందంతో మరింత వేగంగా ముందుకు సాగనుందని బీఎస్ మూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిశోధనలు.. ఆవిష్కరణకు, వాటిని మార్కెట్లోకి తీసుకురావడంలో బీయాండ్ నెక్ట్స్ సంస్థ నుంచి సహాకారం అందుతుదని.. జపాన్ సహకారంతో ఐఐటీ నిర్మాణం సాగుతుండగా.. ఈ ఒప్పందం రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిందని మూర్తి పేర్కోన్నారు. భారత్ అనుబంధం కొనసాగిస్తున్న ఈ రెండు సంవత్సరాల అనుబంధం తమకు మంచి సంతృప్తిని ఇచ్చాయని బీయాండ్ నెక్ట్స్ వెంచర్స్ సంస్థ సీఈవో టూషుయోషి ఇటో పేర్కొన్నారు. విద్యాసంస్థల ల్యాబుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చేయించి.. వాటిని మార్కెట్లో విజయవంతంగా నిలబెట్టడమే తమ సంస్థ లక్ష్యమని ఆయన తెలిపారు. భారత్-జపాన్ల మధ్య స్వేచ్ఛాయుత ఆవిష్కరణలు, అవకాశాల వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.
విద్యా, పరిశ్రమల అభివృద్ధిపై జపాన్-భారత్ మధ్య ఒప్పందం
IITH AND BNVI MOU: విద్యా, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం మరింత బలోపేతం దిశగా భారత్-జపాన్ మరో ముందడుగు వేశాయి. ఐఐటీ హైదరాబాద్ జపాన్‌కు చెందిన బీయాండ్ నెక్ట్స్ వెంచర్స్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త ఒప్పందంతో పారిశ్రామిక సాంకేతిక రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు తీసుకురాబోతున్నట్లు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు.
"ఇండో-జపాన్ సహకారం మరో దశలోకి ప్రవేశించిందని నిరూపించడానికి ఐఐటీహెచ్, బీఎన్వీఐ మధ్య జరిగిన ఒప్పందం ఒక ఐకానిక్ అచీవ్‌మెంట్. రెండు దేశాల మధ్య ఉన్న సహకార సంబంధాలు విస్తృతమైనవి, వైవిధ్యమైనవి. ఇక్కడ స్టార్టప్‌లు వాటి వ్యవస్థల అభివృద్ధికై చెందుతున్న కీలక కారకాలు. ప్రయోగశాలలో ప్రారంభ-దశ సాంకేతికతల నుంచి సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఓపెన్ ఇన్నోవేషన్ గురించి బీఎన్వీఐ తత్వశాస్త్రానికి నేను గట్టిగా మద్దతు ఇస్తున్నాను. రెండు దేశాల వెలుపల సైతం వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి విద్యా పరిశోధన ఫలితాలను మెరుగ్గా, మరింతగా ఉపయోగించుకోవడానికి ఇటువంటి తత్వశాస్త్రం చాలా ముఖ్యమైనది."- ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్. మూర్తి
ఇవీ చదవండి: