autonomous car by IIT Hyderabad : కాలం ముందుకు సాగే కొద్ది సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే మొదటిసారిగా c... మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు తయారుచేసే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ అందుబాటులోకి తెచ్చింది. సహజ వాతావరణంలో వీటిని పరీక్షించేలా రెండు కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నిర్మించారు. సిగ్నల్స్, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ల మీద ఉండే ఇతరత్రా అడ్డంకులు కూడా ఈ ట్రాక్ మీద సృష్టించారు. డ్రైవర్ లేకుండా 2 కిలోమీటర్లు ఓ కారుని నడిపించి పరీక్షించారు. ఇటువంటి సాంకేతిక ప్రయోగం దేశంలోనే మొదటిది కావడం విశేషం. తాజాగా ఇక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. డ్రైవర్ లేకుండా నడిచే వాహనంలో ప్రయాణించారు.
ప్రొఫెసర్ రాజలక్ష్మి నేతృత్వంలో దాదాపు నలభై మందికి పైగా యువ పరిశోధకులు ఈ ఆవిష్కరణలో భాగస్వాములవుతున్నారు. వీరు ప్రధానంగా డ్రైవర్ లేకుండా నడిచే కార్లు... మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు... ఎవరి అవసరం లేకుండా వాటంతట అవే నడిచే సైకిళ్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ పరీక్షల దశలో ఉన్నాయి. వ్యవసాయంలో ఉపయోగించేలా రకరకాల డ్రోన్లను సైతం వీరు సిద్ధం చేస్తున్నారు. కేవలం 20 గ్రాముల బరువున్న డ్రోన్‌నూ ఇక్కడ తయారు చేస్తున్నారు. డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలను ఆగస్ట్ నుంచి ఐఐటీ ప్రాంగణంలో నడిపేలా కసరత్తు చేస్తున్నారు.