తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2019, 6:57 PM IST

ETV Bharat / city

ఇప్పుడిక మీ గుండె భద్రం..!

హృద్రోగ సమస్యల్లో ముఖ్యంగా ఉపయోగించే ఈసీజీ రిపోర్టును వేగంగా పరిశీలిస్తే మృత్యువును జయించొచ్చు. దీని కోసం ఐఐటీ హైదరాబాద్​కు చెందిన రీసెర్చ్​ స్కాలర్​ ఓ పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా ఈసీజీ రిపోర్టును వేగంగా పరిశీలించి వైద్యునికి, రోగికి సత్వర సమాచారన్ని అందజేస్తుంది.

ఇప్పుడిక మీ గుండె భద్రం..!
ఇప్పుడిక మీ గుండె భద్రం..!

గుండె సంబంధిత వ్యాధులు వస్తే రోగిలోనే కాదు కుటుంబంలో కలిగే ఆందోళనకే సగం చచ్చిపోతాం. గుండెపోటు లేదా మరేదైన హృద్రోగ సమస్య వస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఈసీజీ తీస్తాం. ఈసీజీలో వచ్చే మార్పులను వెంటనే పసిగట్టకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ డేటాను వెనువెంటనే నిర్ధారించేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ఓ పరికరాన్ని కనిపెట్టారు. అతి తక్కువ విద్యుత్​ ఖర్చుతో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ రిపోర్టును పరిశీలిస్తూ రోగి గుండె పనితీరును అంచనా వేస్తుంది. అంతేనా.. డాక్టర్​, రోగిని అలర్ట్​ చేస్తుంది.

ఈసీజీ రిపోర్టును పరిశీలించే పరికరం

ప్రజలకు వచ్చే జబ్బుల్లో హృద్రోగ సమస్యలది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ప్రజల్లో మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, మద్యం, ధూమపానం సేవించడం లాంటి ఎన్నో అలవాట్లు గుండెజబ్బులకు దారితీస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. ఈ వ్యాధులన్నింటిలో సత్వరమే చర్యలు చేపట్టకపోతే ప్రాణాలు వేగంగా గాల్లోకి కలిసిపోతాయి. వీటన్నింటని దృష్టిలో పెట్టుకుని ఐఐటీ హైదరాబాద్​కు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ విభాగానికి చెందిన స్కాలర్ వేమిశెట్టి నరేశ్ బృందం ఈ పరికరాన్ని రూపొందించింది. ​

" రోగికి వచ్చిన వ్యాధిని నిర్ధారించేందుకు సమయం తీసుకోవడం వల్ల ఏ రోగి చనిపోకూడదు. ప్రస్తుత కాలంలో శాస్త్రసాంకేతికతను ఉపయోగించి దీన్నుంచి బయటపడొచ్చు. ఈసీజీ సంకేతాల్లో వచ్చే మార్పులను వేగంగా పరిశీలించేందుకు మేం తయారు చేసిన పరికరం ఉపయోగపడుతుంది."

- నరేష్​, రీసర్చ్​ స్కాలర్

ABOUT THE AUTHOR

...view details