తెలంగాణ

telangana

ETV Bharat / city

సోషల్​ మీడియా.. వెండితెర సింహాసనం

సోషల్​ మీడియా కేవలం టైంపాస్​కి మాత్రమే కాదు. ఇప్పుడదోక ప్రపంచం.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలనుకున్నా.. ఏదైనా విషయాన్ని ఎక్కువ మందికి చేరవేయాలన్నా.. అదో పెద్ద ఫ్లాట్​ఫాం. సినిమాల విషయంలో కనిపించని హీరో పాత్ర సామాజిక మాధ్యమాలది.

Social Hero
సోషల్​ మీడియా.. వెండితెర సింహాసనం

By

Published : Mar 19, 2021, 5:17 AM IST

దేశంలో డిజిటల్ సంస్కృతి.. బుల్లెట్ రైలు కంటే వేగంగా దూసుకెళ్తోంది. తగ్గిన డేటా రేట్లతో వాడకం పెరిగింది. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలు ఇప్పుడు జీవితంలో ఓ భాగం. వాటినే ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి చిత్ర బృందాలు.

అప్పుట్లో బాహుబలి చిత్రంలో రోజుకో గెటప్ రిలీజ్ చేస్తూ.. చిత్ర బృందం అందరిలోనూ ఉత్కంఠ పెంచింది. నిన్నటి జాతిరత్నాలు సినిమా టీమ్.. అల్లరి చేస్తూ.. సోషల్ మీడియాలో సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే. ఇప్పుడు సినిమా ప్రచార ప్రపంచంలో సామాజిక మాధ్యమాలదే హవా.

ఇంతకు ముందు సినిమా ప్రచారానికి చిత్ర బృందాలు చాలా డబ్బు ఖర్చు చేసేవి. టీవిల్లో ప్రసారాలు, గోడ పత్రికలంటూ ఆదరణ పెంచుకునేవి. ఇప్పుడు మెట్రో నగరాల నుంచి గ్రామాల వరకూ విస్తరించిన డిజిటల్​ సేవలే వారికి యాడ్​ ఏజెన్సీలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో లభించినంత ప్రచారం ఇంకెక్కడ లేదు.

చిత్రం విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే తారలు ప్రతీ విషయాన్నీ సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. అలా సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. సాధారణ ప్రచారంతో పోల్చుకుంటే... నిజానికి సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపుతోంది. వెండితెరపై కాసుల వర్షం కురవాలంటే.. ఫోన్​ తెరలపై ప్రచారానికి చిత్ర బృందాలు రెడీ అయిపోతున్నాయి.

ఇదీ చదవండీ:అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య: పొన్నాల

ABOUT THE AUTHOR

...view details