నిజం చెప్పండి. జీవితంలో ఎంతమందిని ప్రేమతో.. ఇష్టంతో చూసుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట దొంగ చూపు చూసినవారే. మేం చాలా డిసెంట్ బాబు అనే వాళ్లు కూడా.. ఏదో ఒక అంశంపై దృష్టి పెట్టి.. మీ కళ్లను బానిసలు చేసినవారే. ఎందుకంటే చూపునకు అంత మహాత్యం. చూపులు క్షణాలే అయినా.. మనసులో జీవితాంతం ఉండిపోతాయి. అవతలి వారి చూపే.. వారిపై మన అభిప్రాయం.
పాఠశాల నుంచి మెుదలయ్యే.. ఈ చూపుల కలయిక మనిషి చనిపోయేంత వరకూ ఉంటుంది. అది కాలేజీ కావొచ్చు.. పనిచేసే ఆఫీస్ కావొచ్చు. మీరు నడుస్తున్న ఫుట్ పాత్.. మీరు ఎక్కిన బస్సు, చివరకు మీ పక్కింటి బాల్కానీ. మనిషి చూపులో పవర్ ఉంటుంది. మనిషిని అంచనా వేసేందుకు.. ప్రేమను చూపేందుకు చూపులు చాలా రకాలుగా ఉంటాయండి.
మనం రోజూ.. చూస్తాం కాబట్టి పట్టించుకోం. చూపులను మనం ఒకలా చూస్తే.. సైకాలజిస్టు మరోలా చూస్తారు. చూపుల కలయికపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ చూపుల ప్రభావమెంత అని తెలుసుకునేందుకు ఓ ప్రయోగం జరిగింది. ఒక వ్యక్తి ముఖం మాత్రమే కనిపించేలా కెమెరా సెట్ చేశారు. ఆ వీడియోలోని వ్యక్తి కళ్లను చూసే పని కొంతమందికి అప్పజెప్పారు.