మోడలింగ్ కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతి ఎల్లారెడ్డిగూడలోని ఓ వసతి గృహంలో ఉంటోంది. అక్కడ వసతిగృహం యజమాని కుమారుడితో పరిచయం ఏర్పడి... ప్రేమకు దారి తీసింది. దానిని చనువుగా తీసుకున్న యువకుడు యువతిపై అత్యాచారం చేస్తుంటే అతని స్నేహితుడు చరవాణిలో చిత్రీకరించాడని ఆరోపిస్తూ... జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువకులిద్దరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించారంటూ యువతి ధన్యవాదాలు తెలిపింది.
ఊహించని మలుపు..
అత్యాచారం చేశారని ఓ యువతి తన కుమారుడిపై అక్రమంగా ఫిర్యాదు చేసిందని నిందితుని తల్లి ఆరోపించింది. యువతే తన కుమారుడిని, స్నేహితుడిని ట్రాప్ చేసిందని వెల్లడించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించినట్లు ఆరోపించింది. పలు వాయిస్ రికార్డులు, వాట్సాప్ ఛాటింగ్లను పోలీసులకు అందించింది. తప్పుడు కేసులు పెట్టి 20 లక్షలు డిమాండ్ చేసిందని... డబ్బు కోసమే ఆమె ఇలాంటి వాటికి పాల్పడుతోందని పేర్కొంది. మగ పిల్లలను ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడితే... ఆడపిల్లలపై కేసులు పెట్టే చట్టాలు ఉండవా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
విచారిస్తున్నామని..