తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా' - జేసీ ప్రభాకర్​ రెడ్డిపై కేసులు వార్తలు

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్​ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ప్రకటిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. జైలులోనూ తనను ఇబ్బంది పెట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని ఆరోపించారు.

'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'
'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'

By

Published : Aug 7, 2020, 5:31 PM IST

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్​కి శాలువా కప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగంపై 54 రోజుల పాటు కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. గురువారం బెయిల్​పై విడుదలయ్యారు. జైలులో తనకు ఎదురైన అనుభవాలను ఈటీవీ భారత్​కు వివరించారు.

'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'

నేను జైలులో ఉన్నా కొందరు నాపై కక్ష సాధింపులు మానుకోలేదు. బెడ్ ఇవ్వకూడదని, సరైన ఆహారం అందించకూడదని అధికారులపై కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... అమరావతి నుంచి ఒత్తిడి తెచ్చారు. కానీ జైలు అధికారులు, సిబ్బంది నాకు సహకరించారు. తప్పుడు అభియోగాలతో నన్ను అరెస్ట్ చేశారు. అసలు నాకు ఎన్ని వాహనాలు ఉన్నాయనే విషయం కూడా తెలియని నా కుమారుడు జేసీ అస్మిత్​రెడ్డిని కూడా ఈ కేసులో ఇరికించారు- జేసీ ప్రభాకర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కరోనా, లాక్​డౌన్​తో తాడిపత్రిలోని పేదలు ఇబ్బంది పడకుండా... అందరికీ పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో అమలు చేస్తామని జేసీ ప్రభాకర్​ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్​ రెడ్డి సహా 31 మందిపై కేసు

ABOUT THE AUTHOR

...view details