రూట్లను ప్రైవేటుపరం చేయోద్దని రాష్ట్ర కాంగ్రెస్... ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ రూట్లను ప్రైవేటుపరం చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని హస్తం నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయకుండా బలోపేతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ అన్నారు. కార్మికులెవరూ ధైర్యం కోల్పోవద్దని ఆర్టీసీ సమ్మె ఎల్లలు దాటిందని పేర్కొన్నారు. వాషింగ్‌టన్ డీసీలో తెలుగువాళ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను అడ్డుకున్నట్లు తెలిపారు.
"మీరు ప్రైవేటుపరం చేస్తే.. మేం రద్దు చేస్తాం" - tsrtc on congress latest
సీఎం కేసీఆర్ రూట్లను ప్రైవేటుపరం చేస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని హస్తం నేతలు తెలిపారు. ప్రభుత్వ ప్రకటనలతో కార్మికులెవరూ ధైర్యం కోల్పోవద్దని ఆర్టీసీ సమ్మె ఎల్లలు దాటిందని జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తెలిపారు.
!["మీరు ప్రైవేటుపరం చేస్తే.. మేం రద్దు చేస్తాం" if-rtc-is-privatized-we-will-abolish-our-government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5198017-488-5198017-1574872307205.jpg)
"ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే.. మా ప్రభుత్వంలో రద్దు చేస్తాం"
"ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే.. మా ప్రభుత్వంలో రద్దు చేస్తాం"
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. అన్ని ప్రభుత్వ సంఘాలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.