తెలంగాణ

telangana

ETV Bharat / city

నిరూపిస్తే ఆలయ ఛైర్మన్ పదవి సహా ఆస్తులు రాసిస్తా: సుధీర్ రెడ్డి - భాజపా నేత ఆవుల సతీష్

హైదరాబాద్ ప్రగతినగర్​లో ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన సాయిబాబా ఆలయంలో అక్రమాలకు పాల్పడ్డానని వచ్చిన ఆరోపణనలు ఆలయ ఛైర్మన్ సుధీర్ రెడ్డి ఖండించారు. తన మీద ఆరోపణలు నిరూపిస్తే పదవి వదులుకోవడం సహా వ్యక్తిగత ఆస్తులను రాసిస్తానని సవాల్ విసిరారు.

నిరూపిస్తే ఆలయ ఛైర్మన్ పదవి సహా ఆస్తులు రాసిస్తా: సుధీర్ రెడ్డి
నిరూపిస్తే ఆలయ ఛైర్మన్ పదవి సహా ఆస్తులు రాసిస్తా: సుధీర్ రెడ్డి

By

Published : Sep 11, 2020, 5:37 PM IST

Updated : Sep 11, 2020, 5:55 PM IST

హైదరాబాద్ ప్రగతినగర్​లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన సాయిబాబా ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని భాజపా నేత ఆవుల సతీష్ వ్యాఖ్యలను ఆలయ ఛైర్మన్ సుధీర్ రెడ్డి ఖండించారు. కమిటీలోని సభ్యుల ఏకాభిప్రాయంతోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని సుధీర్ రెడ్డి వెల్లడించారు.

నిరూపించకుంటే భాజపా పదవి వదులుకోవాలి..

పక్కనే ఉన్న 1000 గజాల స్థలాన్ని తాను అమ్ముకున్నానని చెప్పడం సరికాదన్నారు. నిరూపిస్తే ఆలయ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తన ఆస్తి మొత్తం ఆలయ కమిటీకే రాసిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించకపోతే నిజాంపేట కార్పొరేషన్ భాజపా అధ్యక్ష పదవికి ఆవుల సతీష్ రాజీనామా చేయాలని సుధీర్ డిమాండ్ చేశారు.

నిరూపిస్తే ఆలయ ఛైర్మన్ పదవి సహా ఆస్తులు రాసిస్తా: సుధీర్ రెడ్డి

ఇవీ చూడండి : ఆ సభలో సభ్యుడిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: దానం

Last Updated : Sep 11, 2020, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details