ఏపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బట్టువానిపల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. గ్రామ శివార్లలోని కొల్లూరు ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలతో పాటు ఆలయంపై ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. తాము ఎంతో పవిత్రంగా చూసుకునే ఆలయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం తమను భయభ్రాంతులకు గురి చేస్తోందని స్థానికులు చెప్పారు.
మరో ఆలయంపై దాడి... ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం - కళ్యాణదుర్గం నేర వార్తలు
ఆంధ్రప్రదేశ్లో అంతర్వేదిలో రథం దగ్ధం, దుర్గ గుడిలో సింహాల విగ్రహాలు మాయం ఘటనలపై ఆగ్రహ జ్వాలలు చల్లారకముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బట్టువానిపల్లిలోని ఆలయంలో సీతారామాంజనేయుల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు.
మరో ఆలయంపై దాడి... ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం
సంఘటన స్థలాన్ని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు పరిశీలించారు. విగ్రహాల ధ్వంసం హేయమైన చర్య అని.... దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధ్యులను వెంటనే గుర్తించి కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయాన్ని డీఎస్పీ వెంకట రమణ పరిశీలించి వివరాలు సేకరించారు.